మందు కలపడానికే మంత్రులు | Revanth reddy fires on ministers | Sakshi
Sakshi News home page

మందు కలపడానికే మంత్రులు

Feb 29 2016 3:00 AM | Updated on Aug 14 2018 10:54 AM

మందు కలపడానికే మంత్రులు - Sakshi

మందు కలపడానికే మంత్రులు

రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

కేసీఆర్‌పై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధ్వజం

 సాక్షి, మంచిర్యాల: రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మందు కలపడానికి మంత్రులను, తన ఇల్లు తుడవడానికి ఎమ్మెల్యేలను వాడుకుంటూ వారిని బానిసలుగా మార్చేశారన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. సిర్పూర్ పేపర్ మిల్లు మూతబడి ఏడాది దాటి.. 12 మంది ఆత్మహత్యలు చేసుకున్నా ఇంతవరకు సీఎందాన్ని తెరిపించలేకపోయారన్నారు.  2019 ఎన్నికల్లో తాము వంద సీట్లను యువతకే ఇస్తామని, అందులో 50 శాతం సీట్లను బడుగు బలహీనవర్గాలకు కేటాయిస్తామన్నారు.

హరితహారం పథకంలో సీఎంను అశోక చక్రవర్తితో పోల్చిన మంత్రి జోగు రామన్న ఎన్ని మొక్కలు నాటారు.. అందులో ఎన్ని బతికాయో చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న వారిని తరమేస్తోందన్నారు. శాసనసభ సమావేశాల్లో ఇందిరమ్మ బిల్లులు చెల్లించనోళ్లు, మిల్లులను తెరిపించ నోళ్లు, గిరిజనులు, గిరిజనేతరులను భూముల నుంచి తరిమేటోళ్లను తొడగొట్టి పడగొడ్తానన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాథోడ్ మ్రేశ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్, కార్యదర్శి జయచందర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement