దేవరపల్లి/ఏలూరు సెంట్రల్ : బాలికపై లైంగిక దాడి కేసులో నిందితునికి పదేళ్ల జైలు శిక్ష, రూ.ఐదువేల జరిమానా విధిస్తూ.. జిల్లా న్యాయస్థానం శుక్రవారం తీర్పుచెప్పింది.
లైంగిక దాడి కేసులో నిందితునికి పదేళ్ల జైలు
Oct 1 2016 1:56 AM | Updated on Jul 28 2018 8:53 PM
దేవరపల్లి/ఏలూరు సెంట్రల్ : బాలికపై లైంగిక దాడి కేసులో నిందితునికి పదేళ్ల జైలు శిక్ష, రూ.ఐదువేల జరిమానా విధిస్తూ.. జిల్లా న్యాయస్థానం శుక్రవారం తీర్పుచెప్పింది. ఎస్సై సి.హెచ్. ఆంజనేయులు కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో 2015లో మిర్యాల వజ్రం అనే వ్యక్తి ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసినట్టు కేసు నమోదైంది. కోర్టులో వాదోపవాదాల అనంతరం శుక్రవారం న్యాయమూర్తి కె.సాయిరమాదేవి నిందితుడికి పదేళ్ల కారాగార శిక్ష, రూ.ఐదువేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే మరో 3 నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తీర్పుచెప్పారు.
Advertisement
Advertisement