గరుడ వాహనంపై విహరించిన రంగనాథుడు | ranganath on garudavahana | Sakshi
Sakshi News home page

గరుడ వాహనంపై విహరించిన రంగనాథుడు

Apr 10 2017 9:46 PM | Updated on Sep 5 2017 8:26 AM

గరుడ వాహనంపై విహరించిన రంగనాథుడు

గరుడ వాహనంపై విహరించిన రంగనాథుడు

తర్తూరు శ్రీలక్ష్మీ రంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు గరుడవాహనంపై గ్రామంలో విహరించారు.

జూపాడుబంగ్లా : తర్తూరు శ్రీలక్ష్మీ రంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు గరుడవాహనంపై గ్రామంలో విహరించారు. వేదమంత్రాల మధ్య స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. పట్టువస్త్రాలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పల్లకి గరుడవాహనం వద్దకు తీసుకొచ్చారు. స్వామివారిని వాహనంపై అధిష్టింపజేసి గోవింద నామాన్ని స్మరిస్తూ పురవీధుల్లో తిప్పారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి కాయ, కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గరుడోత్సవాన్ని పురుస్కరించుకొని చందా, గుండు ఎత్తే పందేలను నిర్వహించారు. గెలుపొందిన వారికి స్వామివారిని అలంకరించిన పూలమాలలతో సత్కరించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement