కరవు నివారణ చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.
విజయవాడ : కరవు నివారణ చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం విజయవాడలో రఘువీరా విలేకర్లలో మాట్లాడుతూ... ఎమ్మెల్యేలను పార్టీ పిరాయించడంపై చూపుతున్న శ్రద్ధ మంచినీటి సమస్యను పరిష్కరించడంలో లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న కరవుపై అధ్యయనానికి రెండు బృందాలను ఏపీ పీసీసీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 22న ప్రకాశం బ్యారేజ్పై ఆందోళన చేస్తామని రఘువీరా స్పష్టం చేశారు.