రాష్ట్రంలో చంద్రబాబు రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. శుక్రవారం ఆయన జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెంలో పార్టీ మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం నోట్ల రద్దు కారణంగా పల్లెలో ప్రజలు కన్నీరు పెడుతున్నారన్నారు.
రాష్ట్రంలో రాక్షసపాలన
Dec 23 2016 11:24 PM | Updated on Sep 4 2017 11:26 PM
చందన్న కానుకలోనూ కక్కుర్తే
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శ
జీలుగుమిల్లి : రాష్ట్రంలో చంద్రబాబు రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. శుక్రవారం ఆయన జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెంలో పార్టీ మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం నోట్ల రద్దు కారణంగా పల్లెలో ప్రజలు కన్నీరు పెడుతున్నారన్నారు. ప్రజలను రోడ్ల పాలు చేసి ప్రభుత్వం రోజుకో మాట చెబుతుందని తెలిపారు. చంద్రబాబు ద్వం«ధ్వ వైఖరి వల్ల రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అధికార పార్టీ నాయకులు వచ్చిన కాడికి దోచుకోవడం తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదని పేర్కొన్నారు. పండగలకు ఇచ్చే చంద్రన్న కానుకలో కూడా కక్కుర్తిపడి నాసిరకం సరుకులు ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత పటిష్టం చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ వైఎస్సార్ పథకాలను చంద్రబాబు తుంగలో తోక్కుతన్నారని, పేదల సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలన్నా, సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలుపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అ«ధ్యక్షురాలు వందనపు సాయి బాలపద్మ, అధికార ప్రతినిధి పాల్నాటి బాబ్జి, రాష్ట్ర నాయకుడు సుధీర్ బాబు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాశం రామకృష్ణ, బీసీ సెల్ చలమల శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి దాకే శ్రీదేవి, పార్టీ మండల శాఖ అ««ధ్యక్షుడు గూడవల్లి శ్రీనివాసరావు, సరిపల్లి సత్యనారాయణ రాజు, బోదా శ్రీనివాసరెడ్డి, బూరుగు ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement