కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి గురువారం చేపట్టనున్న సమ్మెలో పోస్టల్ ఉద్యోగులు కూడా పాల్గొననున్నట్లు తపాలా ఉద్యోగుల సంఘాలు పేర్కొన్నాయి. ఈ మేరకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ (ఎన్‌ఎఫ్‌పీఈ) సర్కిల్ సహాయ కార్యదర్శి వరప్రసాద్, డివిజన్ కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, ఈశ్వరయ్య, లక్ష్మికాంత్ బుధవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
నేడు పోస్టల్ ఉద్యోగుల సమ్మె
Mar 15 2017 11:31 PM | Updated on Sep 5 2017 6:10 AM
– ఎన్‌ఎఫ్‌టీఈ వెల్లడి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి గురువారం చేపట్టనున్న సమ్మెలో పోస్టల్ ఉద్యోగులు కూడా పాల్గొననున్నట్లు తపాలా ఉద్యోగుల సంఘాలు పేర్కొన్నాయి. ఈ మేరకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ (ఎన్‌ఎఫ్‌పీఈ) సర్కిల్ సహాయ కార్యదర్శి వరప్రసాద్, డివిజన్ కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, ఈశ్వరయ్య, లక్ష్మికాంత్ బుధవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఏడో వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫార్ములాను మార్చాలని, కనీస వేతనం రూ. 26 వేలుగా నిర్ణయించాలని పేర్కొన్నారు. ఒక్కరోజు సమ్మెలో భాగంగా గురువారం విధులకు గైర్హాజరవుతున్నట్లు ఆ ప్రకటనలో వివరించారు.
Advertisement
Advertisement