కుప్పంలో పోలీసుల విచారణ | Police investigation in Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో పోలీసుల విచారణ

May 5 2017 1:27 AM | Updated on Sep 5 2017 10:24 AM

కుప్పంలో పోలీసుల విచారణ

కుప్పంలో పోలీసుల విచారణ

కుప్పం సర్కిల్‌ కార్యాలయంలో గురువారం పోలీసులు విచారణ చేపట్టారు. ఏఎస్పీ అభిషేక్‌ మొహంతి, చిత్తూరు ఎస్‌బీఐ ఎస్‌ఐ

కుప్పం : కుప్పం సర్కిల్‌ కార్యాలయంలో గురువారం పోలీసులు విచారణ చేపట్టారు.  ఏఎస్పీ అభిషేక్‌ మొహంతి, చిత్తూరు ఎస్‌బీఐ ఎస్‌ఐ రవిబాబు, చిత్తూరు ఏఎస్‌ఐ వసంత కుప్పం చేరుకుని సీఐ కార్యాలయంలో ఉదయం 9.20 గంటల నుంచి  5 గంటలు విచారణ చేపట్టారు. కుప్పం సర్కిల్‌లోని మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఎస్‌ఐలు, పలువురు సిబ్బందితో మాట్లాడారు.

సీఐ రాజశేఖర్‌ మహిళా కానిస్టేబుల్‌ నిర్మలను వేధింపులకు గురిచేశారా, ఈ వేధింపులకు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్‌ రైలుకింద పడి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నం చేసిందా, సిబ్బందిపై సీఐ ప్రవర్తన ఎలా ఉంటుంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ప్రత్యేక ఛాంబర్‌లో విచారణ చేపట్టారు. విచారణకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement