2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని ఏపీ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
రాజమండ్రి: 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని ఏపీ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆనం కళాకేంద్రంలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఆయనతోపాటు ఏపీ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నరాజప్ప మాట్లాడుతూ.. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.