
అడ్డాలపాలెం వరుడితో ఫిలిప్పీన్స్ వధువు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం శివారు అడ్డాలపాలెంకు చెందిన చొప్పల ఆశీర్వాదం, ఫిలిప్పీన్స్ దేశస్తురాలు అల్మా మరియాడోలా స్థానిక పెద్దల సమక్షంలో బుధవారం వివాహం చేసుకున్నారు.
సఖినేటిపల్లి : సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం శివారు అడ్డాలపాలెంకు చెందిన చొప్పల ఆశీర్వాదం, ఫిలిప్పీన్‌స దేశస్తురాలు అల్మా మరియాడోలా స్థానిక పెద్దల సమక్షంలో బుధవారం వివాహం చేసుకున్నారు. అరవై ఏళ్ల వయస్సున్న ఆశీర్వాదంకు భార్య ఏడేళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి కువైట్ దేశంలోని హోటల్‌కు ఆడిట్ జనరల్‌గా పని చేస్తున్న ఆశీర్వాదంకు, అదే హోటల్‌లో కొలీగ్‌గా ఉన్న సుమారు 50 ఏళ్ల ఫిలిప్పిన్స్ దేశస్తురాలు మరియాడోలాతో పరిచయమైంది. వీరి పరిచయం పెళ్లి వరకూ వచ్చింది.
దీంతో ఇరు కుటుంబ సభ్యుల అనుమతితో వారు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం చేసుకున్నారు. వీసా సమస్యలతో మరియాడోలా కుటుంబ సభ్యులు భారత్‌కు రాలేక పోయినట్లు పెద్దలు చెప్పారు. పాస్టర్లు మైలాబత్తుల మధు, జిల్లెళ్ల జోసఫ్ కృపావర్మ, అబ్రహం, స్థానికులు మైలాబత్తుల రాజేష్, కిరణ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.