బండరాయి మీదపడి వ్యక్తి దుర్మరణం | person died in stone slab | Sakshi
Sakshi News home page

బండరాయి మీదపడి వ్యక్తి దుర్మరణం

Jul 13 2016 2:13 AM | Updated on Oct 9 2018 5:43 PM

బండరాయి మీదపడి వ్యక్తి దుర్మరణం - Sakshi

బండరాయి మీదపడి వ్యక్తి దుర్మరణం

బండరారుు మీదపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఘట్‌కేసర్ మండలం మైసమ్మగుట్టలో ఘటన
ఘట్‌కేసర్: బండరాయి మీదపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మైసమ్మగుట్ట కాలనీలో నివాసం ఉండే వరికుప్పల లక్ష్మయ్య(32) రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో అతడు మంగళవారం ఉదయం కాలనీ సమీపంలోని గుట్టపైకి రాళ్లు కొట్టేందుకు వెళ్లాడు. రాళ్ళు కొడుతుండగా ప్రమాదవశాత్తు సమీపంలోని పెద్ద బండారారుు వచ్చి అతడిపై పడిపోరుుంది. 

తలకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బండరారుుని తొలగించి మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య స్వర్ణ, పిల్లలు సరిత, అశోక్ ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement