పవనసుతునికి ప్రణామం | pavanasuthuniki pranamam | Sakshi
Sakshi News home page

పవనసుతునికి ప్రణామం

Nov 22 2016 11:04 PM | Updated on Sep 4 2017 8:49 PM

పవనసుతునికి ప్రణామం

పవనసుతునికి ప్రణామం

జంగారెడ్డిగూడెం రూరల్‌: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మ ద్ది ఆంజనేయస్వామి ఆలయం హనుమద్‌ నామస్మరణతో మార్మోగింది.

జంగారెడ్డిగూడెం రూరల్‌: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మ ద్ది ఆంజనేయస్వామి ఆలయం హనుమద్‌ నామస్మరణతో మార్మోగింది. కార్తీక మంగళవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామిని విశేషంగా అలంకరించి తమలపాకులతో పూజలు చేశారు. 
40 వేల మందికి అన్నదానం
తిరుమలదేవిపేటకు చెందిన వీరబ్రహ్మేంద్రస్వామి బాల భక్త భజన మండలి సభ్యులు ఆంజనేయ భజన, హనుమాన్‌  చాలీసా పారాయణం చేశా రు. ఆలయానికి ఒక్కరోజు ఆదాయం రూ.5,39,126 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. చక్రదేవరపల్లి గ్రామస్తులు అందించిన అన్నప్రసాదాన్ని సుమారు 40 వేల మంది స్వీకరించారు. విశాఖజిల్లా అనకాపల్లికి చెందిన బొడ్డు శ్రీమన్నారాయణ, కస్తూరిబాయి దంపతులు భక్తులకు 50 వేల గారెలను పంచిపెట్టారు. ఆర్డీవో ఎస్‌.లవన్న, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్‌  జెట్టి గురునాథరావు స్వామిని దర్శించుకున్నారు. అటవీశాఖాధికారులు మొక్కలు, కరూ ర్‌ వైశ్యా బ్యాంకు సిబ్బంది వాటర్‌ ప్యాకెట్లు అందజేశారు. చైర్మన్‌  ఇందుకూరి రంగరాజు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement