హజ్ యాత్రకు వెళ్లేవారు ఈ నెల 24 లోపు ఉర్దూ అకాడమీ కంప్యూటర్ కేంద్రాలలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ జమీర్‌అహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : హజ్ యాత్రకు వెళ్లేవారు ఈ నెల 24 లోపు ఉర్దూ అకాడమీ కంప్యూటర్ కేంద్రాలలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ జమీర్‌అహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం, కదిరి, తాడిపత్రి ఉర్దూ అకాడమీ కేంద్రాల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. ఠీఠీఠీ.జ్చ్జిఛిౌఝఝజ్టీ్ట్ఛ్ఛ.జౌఠి.జీn వెబ్‌సైట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. స్వీయ దరఖాస్తు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, పాస్‌పోర్టు, బ్యాంకు పాస్‌బుక్, బ్లడ్ గ్రూప్, రూ.300 చలానా(ఎస్‌బీఐ, యూబీఐలలో తీసిన)లతో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 85199 62155(అనంతపురం), 94411 78900(కదిరి), 94902 50133(తాడిపత్రి) నెంబర్లలో సంప్రదించాలన్నారు.