నగరంలో మళ్లీ పోలియో కలకలం | once again Polio caused a sensation in the city | Sakshi
Sakshi News home page

నగరంలో మళ్లీ పోలియో కలకలం

Sep 22 2016 11:04 PM | Updated on Sep 4 2018 5:24 PM

నగరంలో మళ్లీ పోలియో కలకలం - Sakshi

నగరంలో మళ్లీ పోలియో కలకలం

నగరంలో మళ్లీ పోలియో ఆనవాళ్లు ఉన్నట్లు మరోసారి భయటపడటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మళ్లీ పోలియో (టైప్‌–2) వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. అంబర్‌పేట, నాగోలు నాలాలో పోలియో ఆనవాళ్లు ఉన్నట్లు మరోసారి భయటపడటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సాధారణ  నమూనా సేకరణలో భాగంగా ఆగస్టు 28న నగరంలో ర్యాండమ్‌గా సేకరించిన శాంపిల్స్‌ను ముంబై డబ్ల్యూహెచ్‌ఓ సంస్థకు పంపగా.. పరీక్షల్లో నాగోలు, అంబర్‌పేట నాలాల్లో పోలియో వైరస్‌ ఉన్నట్లు తేలింది.

వ్యక్తి మలం ద్వారా ఈ వైరస్‌ వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నాలాలో వైరస్‌ బయటపడింది కాబట్టి పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ ఇదే వైరస్‌ పిల్లలకు వ్యాపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే వైరస్‌ ఆనవాళ్లు మళ్లీ బయటపడటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఐదు మాసాల కిందే గుర్తింపు
అంబర్‌పేట్, గోల్నాక నాలాలో పోలియో వైరస్‌ ఆన వాళ్లు ఉన్నట్లు ఐదు మాసాల క్రితమే నిర్ధారణైంది. హైదరాబాద్‌ జిల్లాలోని అ ంబర్‌పేట, గోలా ్నక, బార్కాస్, కంటోన్మెంట్, డబీర్‌పుర, జంగమ్మెట్, కింగ్‌కోఠి, లాలాపేట, మలక్‌పేట, నాంపల్లి, పానిపురా, సీతాఫల్‌మండి, సూరజ్‌భాను ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్, మల్కజిగిరి, బాలానగర్, అల్వాల్, నార్సింగ్, శేర్‌లింగంపల్లి, కీసర, నారపల్లి, ఉప్పల్, అబ్దుల్లాపూర్, సరూర్‌నగర్, బాలాపూర్‌ తదితర ప్రాంతాల్లో హై అలెర్ట్‌ ప్రకటించింది.

డబ్ల్యూహెచ్‌ఓ, యూనిసెఫ్‌ సంస్థల ప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాలు  నగరంలో వేర్వేరుగా పర్యటించాయి. ఆయా  ప్రాంతాల్లో ఆరు మాసాల నుంచి మూడేళ్లలోపు పిల్లలు మూడున్నర లక్షల మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు జూన్‌ 20 నుంచి 26 వరకు ప్రత్యేకంగా ఐపీవీ వాక్సిన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఓపీవీ స్థానంలో ఐపీవీ పరిచయం
అప్పటి వరకు ఉన్న ఓరల్‌ పోలియో వాక్సిన్‌(ఓపీవీ) స్థాన ంలో (ఏప్రిల్‌ 25 నుంచి) కొత్తగా ఇన్‌ యాక్టివేటెడ్‌ పోలియో వాక్సిన్‌(ఐపీవీ) పోలియో ఇంజెక్షన్లను వైద్య ఆరోగ్యశాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రజల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో వాక్సిన్‌ కొరత ఏర్పడింది. దీంతో అప్పటికప్పుడు జెనీవా, చెన్నై నుంచి వాక్సిన్‌ తెప్పించింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీవీ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. దీంతో నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్దకు వచ్చిన పిల్లలకు ఇప్పటిMీ  ఓరల్‌ పోలియో వాక్సిన్‌నే వేస్తున్నట్లు ఈ తాజా ఉదాంతంతో స్పష్టమైంది. పోలియో వైరస్‌ నాలాలో ఉన్నందున అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆ రోగ్యశాఖ స్పష్టం చేస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement