నగదు కోసం రోజులు తరబడి బ్యాంకుల వద్ద నిరీక్షించాల్సిరావడంతో ఖాతాదారుల్లో ఓపిక నశిస్తోంది.
క్యూలైన్‌లో వృద్ధురాలి చేయి విరిగింది..
Dec 16 2016 5:36 PM | Updated on Sep 4 2017 10:53 PM
మెదక్: నగదు కోసం రోజులు తరబడి బ్యాంకుల వద్ద నిరీక్షించాల్సిరావడంతో ఖాతాదారుల్లో ఓపిక నశిస్తోంది. క్యూలో తోపులాటలు జరుగుతున్నాయి. స్థానిక ఎస్‌బీహెచ్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం తోపులాట చోటుచేసుకుంది. మండలంలోని బడంపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు షేక్ అహ్మద్‌బి పింఛను డబ్బుల కోసం తన కోడలితో కలిసి బ్యాంకు వద్దకు వచ్చింది. ఉదయానికే భారీ లైను ఉండడంతో ఆమె కూడా లైన్‌లో నిలబడింది.
మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా జనం తోసుకోవడంతో అహ్మద్‌బి కింద పడిపోయింది. క్యూలో నిలుచుకున్న మరికొందరు ఆమెపై పడిపోవడంతో బ్యాంకు తలుపు అద్దాలు తగిలి ఒత్తిడికి చేయి విరిగిపోయింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు ఆ వృద్ధురాలిని ప్రైవేటు ఆస్పత్రిలో చూపించి సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement