గూడులేని గ్రామ సచివాలయాలు | no buildings for panchayati offices | Sakshi
Sakshi News home page

గూడులేని గ్రామ సచివాలయాలు

Apr 14 2017 5:31 PM | Updated on Sep 5 2017 8:46 AM

మండలంలో పలు పంచాయతీలకు సొంత భవనాలు లేక పాలన కుంటుపడుతోంది.

► బస్టాండ్‌ పాలయిన పీసీపల్లి పంచాయతీ
► సొంత భవనాల ఏర్పాటులో ప్రభుత్వ వైఫల్యం
► పట్టించుకోని అధికారులు
► కుంటుపడుతున్న పంచాయతీ పాలన


పీసీపల్లి: మండలంలో పలు పంచాయతీలకు సొంత భవనాలు లేక పాలన కుంటుపడుతోంది. దీంతో సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు పాఠశాలలు, బస్టాండ్‌లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు లేకపోవండం‍తో పంచాయతీ, ఇతర సమావేశాలు ఎక్కడ జరపాలనేది అధికారులకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. మండలంలోనే మేజర్‌ పంచాయతీ అయిన పీసీపల్లిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత రెండేళ్లుగా ఇక్కడి పంచాయతీ బస్టాండ్‌ పాలయింది. దీంతో వచ్చిన ప్రజలు సర్పంచి, అధికారులతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటోంది. బస్‌ షెల్టర్‌లోని ఒక చిన్న రూములో పంచాయతీ పాలన కొనసాగుతుంది. కొన్ని పంచాయతీల్లో అయితే పాఠశాలల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు.

గ్రామ సచివాలయాలు లేని గ్రామాలెన్నో..: మండలంలోని లక్ష్మక్కపల్లి, తలకొండపాడు, గ్రామాల్లో నేటికి కూడా గ్రామ సచివాలయాలు లేవు. ఇప్పుడే కొత్తగా కడుతున్నారు. కొన్ని గ్రామాల్లో సొంత భవనాలు ఉన్నప్పటికీ సర్పంచులు ఎన్నికై నాలుగు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ ప్రారంభించలేదు. దీంతో ఆ పంచాయతీ భవనాలు అలంకారప్రాయంగా ఉన్నాయి.

కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలు..: మండలంలో పలు పంచాయితీ భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. చింతగుంపల్లి, పీసీపల్లి, బట్టుపల్లి, గుదేవారిపాలెం, గ్రామా పంచాయతీల్లో భవానలు పెచ్చులూడి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి గ్రామాలు అభివృద్ధికి పంచాయతీ భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement