ఎన్డీఎస్‌ఎల్‌లో లేఆఫ్‌ ఎత్తివేయాలి | NDSL lay-off should be lifted | Sakshi
Sakshi News home page

ఎన్డీఎస్‌ఎల్‌లో లేఆఫ్‌ ఎత్తివేయాలి

Jul 26 2016 8:14 PM | Updated on Sep 4 2017 6:24 AM

ఎన్డీఎస్‌ఎల్‌లో లేఆఫ్‌ను ఎత్తివేసి తమకు రావాల్సిన వేతనాలు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 71వ రోజుకు చేరాయి.

మెదక్‌ రూరల్‌: ఎన్డీఎస్‌ఎల్‌లో లేఆఫ్‌ను ఎత్తివేసి తమకు రావాల్సిన వేతనాలు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 71వ రోజుకు చేరాయి. మంగళవారం కార్మికులు పారిశ్రామిక వివాదాల కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు పల్లె సిద్దిరాంలు మాట్లాడుతూ తమ కేసును కోర్టులో వేసినందున న్యాయవాది సూచన మేరకు నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం దీక్షల్లో కూర్చున్న వారిలో బాపురెడ్డి, రాజు, శంభుప్రసాద్, జాకబ్, షంశీర్‌అలీ, రాజాగౌడ్, లక్ష్మణ్‌రావు, కృష్ణ, తిరుపతిరెడ్డి, ఉపెందర్, పెంటయ్య, కిషన్, ధర్మేందర్, వెంకటేశం, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement