
గౌరవం.. రోడ్డుపాలు..
రక్షక భటులకు.. రక్షణ దళాలకు యూనిఫాం, టోపీ ఓ గౌరవం. క్యాప్ హుందాతనాన్ని సూచిస్తుంది.
రక్షక భటులకు.. రక్షణ దళాలకు యూనిఫాం, టోపీ ఓ గౌరవం. క్యాప్ హుందాతనాన్ని సూచిస్తుంది. మనిషికి తల ఎంత అవసరమో.. నేవీ ఉద్యోగికి టోపీ అంతే అవసరం. దానిని గౌరవిస్తేనే మనకు గౌరవం దక్కుతుంది. ఆ హుందాతనాన్ని ఓ నేవీ ఉద్యోగి పొరపాటున దారిలో పారేసుకున్నారు.
డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లే రహదారిలో.. ఈ దృశ్యం సాక్షి కెమెరా కంటపడింది. పదుల సంఖ్యలో వాహనాలపై వెళ్తున్నా.. ఎవ్వరూ దాని గురించి పట్టించుకోలేదు. ఆ టోపీ విలువ తెలిసిన శర్మ అనే విశ్రాంత నేవీ ఉద్యోగి.. బండిని ఆపి.. దాన్ని అందుకున్నారు. బైక్‌పై గౌరవంగా తీసుకెళ్లిపోయారు.