మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కర్నూలుకు రానున్నట్లు కాపు, తెలగ, బలిజ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి నారాయణరెడ్డి, నగర కార్యదర్శి అమరం నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
26న కర్నూలుకు ముద్రగడ రాక
Published Sat, Feb 25 2017 12:38 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
కర్నూలు(అర్బన్): మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కర్నూలుకు రానున్నట్లు కాపు, తెలగ, బలిజ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి నారాయణరెడ్డి, నగర కార్యదర్శి అమరం నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని మెగాసిరి ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీసీ రిజర్వేషన్ల సాధనకు సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తారన్నారు. దీక్షల్లో ముద్రగడ పాల్గొంటున్నారని.. జిల్లాలోని కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాలకు చెందిన వారంతా హాజరు కావాలని కోరారు.
Advertisement
Advertisement