టీడీపీ ఎమ్మెల్సీ కారు ఢీకొని వ్యక్తి మృతి | mlc nareshkumarreddy car met an accident | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్సీ కారు ఢీకొని వ్యక్తి మృతి

Nov 18 2016 11:20 AM | Updated on Aug 10 2018 8:23 PM

టీడీపీ ఎమ్మెల్సీ కారు ఢీకొని వ్యక్తి మృతి - Sakshi

టీడీపీ ఎమ్మెల్సీ కారు ఢీకొని వ్యక్తి మృతి

టీడీపీ నేత వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

మదనపల్లి: టీడీపీ నేత వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని దేవతానగర్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.. టీడీపీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వస్తున్న ఓ ఆటోను ఢీకొట్టింది.

దీంతో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement