ప్రాణపాయ స్థితిలో యువకుడు | man fall into gollapalli reservoir | Sakshi
Sakshi News home page

ప్రాణపాయ స్థితిలో యువకుడు

Mar 19 2017 11:58 PM | Updated on Oct 8 2018 3:07 PM

హిందూపురానికి చెందిన సొహల్‌(2​‍6) పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు.

పెనుకొండ రూరల్‌ : హిందూపురానికి చెందిన సొహల్‌(2​‍6) పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం... ఆదివారం కావడంతో సొహైల్‌ మరి కొందరు కలసి ఆటవిడుపు కోసం రిజర్వాయర్‌ వద్దకు వచ్చారు. అక్కడి  నీటి  ప్రవాహం ఉన్న ప్రాంతంలో దిగేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. అతికష్టమ్మీద బయటకు లాగి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని వెంటనే పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం పెద్దాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement