వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభ్యున్నతి కోసం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసినట్లు ఎన్.రవిశంకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా సీపీఎంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు. తనతో పాటు 16 మంది నాయకులు, 100 మంది కార్యకర్తలు సీపీఎంకు రాజీనామా చేసి బయటకు వచ్చామన్నారు.
కడప రూరల్:
వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభ్యున్నతి కోసం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసినట్లు ఎన్.రవిశంకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా సీపీఎంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు. తనతో పాటు 16 మంది నాయకులు, 100 మంది కార్యకర్తలు సీపీఎంకు రాజీనామా చేసి బయటకు వచ్చామన్నారు. అనంతరం 200 మందితో చర్చించి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీని స్థాపించామన్నారు.
నేడు కార్యాలయం ప్రారంభం
గురువారం ఉదయం 10 గంటలకు కడప ఆఫీసర్స్ క్లబ్ ఎదురుగా కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు రవిశంకర్ రెడ్డి తెలిపారు. అలాగే ఈ నెల 9న పార్టీ ఆవిర్భావ సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు. 10న నిర్వహించే ప్లీనరీలో పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కె.లింగమూర్తి, సి.శేఖర్, ఒ.శంకర్, ఓబయ్య, సుధీర్‌కుమార్, మగ్బూల్‌బాషా, సుబ్బరాయుడు, బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.