ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయపోల్ గ్రామంలో చోటుచేసుకుంది. lady comit suicide, Ibrahimpatnam police station, Rayapol village
ఇబ్రహీంపట్నం: ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయపోల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగరాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వివాహిత డొంకని జ్యోతి(28) ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబీకులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కుటుంబ కలహాలే జ్యోతి ఆత్మహత్యాయత్నానికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.