వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి | labour dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

May 19 2017 12:11 AM | Updated on Sep 5 2017 11:27 AM

మండలంలోని ఓబుళంపల్లికి చెందిన ఉపాధి కూలీ పాలేటక్క (50) వడదెబ్బతో గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.

చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : మండలంలోని ఓబుళంపల్లికి చెందిన ఉపాధి కూలీ పాలేటక్క (50) వడదెబ్బతో గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. మంగళవారం ఉపాధిపనులకు వెళ్లిన పాలేటక్క... పని ప్రాంతంలోనే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తోటి కూలీలు ఆమెను ఇంటికి పంపారు. బుధవారం పుట్టపర్తిలోని ఆస్పత్రికి వెళ్లిన ఆమె.. అక్కడే చికిత్స  పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. కాగా, పాలేటక్కకు భర్త లింగన్న, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement