వాయిదాతో పందేనికి పండుగేనా? | Sakshi
Sakshi News home page

వాయిదాతో పందేనికి పండుగేనా?

Published Fri, Jan 6 2017 11:36 PM

kodi pandalu pending court judgement

  • సుప్రీం ఆదేశాలతో పందెగాళ్లకు ఉపశమనం
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ: 
    సంక్రాంతి కోడి పందేల విషయంలో తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో  మళ్లీ కోళ్లను దువ్వుతున్నారు. గత వారం ఉమ్మిడి హైకోర్లు ఇచ్చిన ఆంక్షలతో సందిగ్ధంలో పడిన పందెం సందడి సుప్రీం ఆదేశాలతో ఊరట చెందుతున్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లోని నాలుగో అంశంపై స్టే ఇస్తూనే తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేయటంతో వారం రోజుల్లో వచ్చే సంక్రాంతి గడిచిపోతుందని, ఈలోగా పందేల దందా పూర్తి చేసుకోవచ్చునని పందెంగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోళ్లను స్వాధీనం చేసుకోవటంపై సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని పందెగాళ్లు స్వాగతిస్తున్నారు. అయితే సుప్రీం జారీ చేసిన రెండు ఆదేశాలతో జిల్లాలో కోడి పందేలను పూర్తి స్థాయిలో అదుపు చేయటంపై పోలీసులకు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కోళ్లను స్వాధీనం చేసుకోవద్దంటే పరోక్షంగా కోడి పందేలకు సంకేతాలు ఇచ్చేలా ఉన్నాయని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంప్రదాయ ఒరవడిలో జరిగే కోడి పందేలను అడ్డుకోవటం సరికాదని తన పిటిష¯ŒSలో విన్నవించారు. సుప్రీం కూడా ఈ కేసును సంప్రదాయ కోణంలో విచారించి ఆయుధాల కోణంలో అభ్యంతరం చెప్పింది. ఆయుధాల పరంగా అభ్యంతరం, కోళ్లను స్వాధీనం చేసుకోవద్దన్న ఆదేశం, విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేయటంతో జిల్లాలోని పందెగాళ్లు ఆ ఉత్తర్వులను తమకు సానుకూలంగా తీసుకుంటుంటే.. జిల్లా పోలీసులు సున్నితంగా ఉన్న ఆ మూడు అంశాలతో పందేలను ఎంత వరకు నిలువరించగలమ ని తర్జన భర్జన పడుతున్నారు. ఇంతటి ఉత్కంఠలో పందెగాళ్లు, పోలీసులు ఇద్దరిలో ఎవరిది విజయమో సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే. ప్రతి సంక్రాంతి పండుగలకు జిల్లాలో కోడి పందేలతో రూ.30 కోట్లు వరకూ చేతులు మారుతున్న క్రమంలో ఈసారి హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆదేశాలు, ఉత్తర్వులతో çపండుగ పందేలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. 
     

Advertisement
 
Advertisement
 
Advertisement