పుస్తకాలతో విజ్ఞానం | knowledge aquired from books only | Sakshi
Sakshi News home page

పుస్తకాలతో విజ్ఞానం

Aug 19 2016 11:15 PM | Updated on Sep 4 2017 9:58 AM

చిన్న కథలు రాసిన విద్యార్థులతో తల్లిదండ్రులు

చిన్న కథలు రాసిన విద్యార్థులతో తల్లిదండ్రులు

చదవడంతో జ్ఞానాన్ని పొందవచ్చని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఎడిటర్‌ కింగ్‌షుక్‌నాగ్‌ పేర్కొన్నారు.

రాయదుర్గం: పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలను చదవడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని సముపార్జించవచ్చని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఎడిటర్‌ కింగ్‌షుక్‌నాగ్‌ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి ఖాజాగూడలోని ఓక్రిడ్జ్‌ అంతర్జాతీయ పాఠశాలలో శుక్రవారం ‘ది అకార్న్‌ బుక్‌’ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నతనం నుంచే గ్రంథాలయాన్ని ఉపయోగించుకునే అలవాటు చేసుకోవాలని సూచించారు. చిన్న చిన్న కథలను రాసేలా విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ అవనీష్‌ సింగ్, పీపుల్‌ కంబైన్‌ డెరెక్టర్‌ డీవీఆర్‌కే ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు. తల్లిదండ్రులు పాల్గొన్నారు.

‘ది అకార్న్‌ బుక్‌’ రెండో ఎడిషన్‌
చిన్న చిన్న కథలను ఒకచోట చేర్చి... పుస్తక రూపం ఇవ్వడాన్ని గత ఏడాది ఓక్రిడ్జ్‌ అంతర్జాతీయ పాఠశాల ప్రారంభించింది. ఆ పుస్తకానికి ‘ది అకార్న్‌బుక్‌’ గా నామకరణం చేసింది. గత ఏడాది మొదటి ఎడిషన్‌ను 65 కథలతో ఆవిష్కరించగా, రెండో ఎడిషన్‌ను 64 కథలతో రూపొందించారు. ఈ ఏడాది నిర్వహించిన చిన్న కథల పోటీకి నగరంలోని 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 64 కథలు అత్యుత్తమమైనవిగా ఎంపిక చేశారు. అందులో 30 మంది ఓక్రిడ్జ్‌ పాఠశాలకు చెందినవారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement