
దసరా సంబురాల్లో కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్కు చేరుకున్నారు. గురువారం అంతా తీరిక లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు
మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్కు చేరుకున్నారు. గురువారం అంతా తీరిక లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులతో కలిసి దసరా సంబురాల్లో పాల్గొన్నారు. ముందు ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే.
అనంతరం ఉన్నపలంగా తిరిగి నల్లగొండ జిల్లా సూర్యాపేటకు హెలికాప్టర్ ద్వారా చేరుకొని అక్కడ తెలంగాణలోని పేదలకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక పథకం పేదలకు డబుల్ బెడ్రూం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి ఫాం హౌజ్ కు చేరుకున్నారు. అంతకు ముందు ఎర్రవెల్లిలో కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దసరా సంబురాల్లో మునిగిపోయారు.