లు ముస్లిం సంఘాల వారు ఉగ్రవాదాని కి వ్యతిరేకంగా నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.
ఇస్లాం మతం శాంతిని ప్రబోధిస్తుంది
Jul 18 2016 2:17 AM | Updated on Sep 4 2017 5:07 AM
	శాంతి ర్యాలీలో మతపెద్దలు
					
					
					
					
						
					          			
						
				
	అనంతపురం న్యూటౌన్ :  ఇస్లాం మతం ఎప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, శాంతిని మాత్రమే ప్రబోధిస్తుందని పలువురు మత పెద్దలు అన్నారు. ఆదివారం పలు ముస్లిం సంఘాల వారు ఉగ్రవాదాని కి వ్యతిరేకంగా నగరంలో  శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉదయం స్థా నిక ఈద్గా మసీదు నుంచి మౌలానా ఆజాద్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా హఫీజ్ గౌసుపీర్, హఫీజ్ ముఫ్తి మహ్మద్ రజా, హఫీజ్ మహిరుద్దీన్, నిస్సార్ అహ్మద్, మసూద్ సాబ్ తదితరులు ఖురాన్ బోధలను వినిపిం చారు. మాజీ గ్రంథాలయ సంస్థ  చైర్మన్ రషీద్ అహ్మద్, వైఎస్సార్‌సీపీ నాయకులు కొర్రపాడు హుస్సేన్‌పీరా, కాంగ్రెస్ నాయకుడు దాదాగాంధీ, సీపీఎం ఇంతియాజ్, టీడీపీ నేత  తాజుద్దీన్ పాల్గొన్నారు. 
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
