పదోతరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా దంతాలపల్లి హైస్కూల్‌లో గురువారం చోటుచేసుకుంది.
నర్సింహులపేట(వరంగల్ జిల్లా): పదోతరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా దంతాలపల్లి హైస్కూల్‌లో గురువారం చోటుచేసుకుంది. నర్సింహులపేట మండలం ఆగపేట యూపీఎస్ ఉపాధ్యాయుడు లేగల(నెలకుర్తి) రాంరెడ్డి(52) దంతాలపల్లి ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రానికి ఇన్విజిలేటర్‌గా వెళ్లారు. పరీక్ష హాల్‌లోనే గుండెపోటుకు గురై పడిపోయూడు.
వెంటనే ఎంఈఓ కొండ్రెడ్డి సోమిరెడ్డి కారులో చికిత్స నిమిత్తం తొర్రూర్‌కు తరలిస్తుండగానే మృతిచెందారు. మృతుడికి భార్య ఉమ, కుమార్తెలు మౌనిఖ, రవళి ఉన్నారు. రాంరెడ్డి 22 ఏళ్లుగా ఈ ప్రాంతంలోనే పని చేస్తుండడంతో అందరికీ సుపరిచితులు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.