ముమ్మరంగా జిల్లా కార్యాలయాల పనులు | Intensive tasks to the district offices | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా జిల్లా కార్యాలయాల పనులు

Oct 4 2016 12:53 AM | Updated on Aug 20 2018 9:16 PM

ముమ్మరంగా జిల్లా కార్యాలయాల పనులు - Sakshi

ముమ్మరంగా జిల్లా కార్యాలయాల పనులు

జయశంకర్‌ జిల్లా (భూపాలపల్లి) ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో భాగంగా కేటాయించిన భవనాలను ఆయా శాఖలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. దసరా పండుగ రోజున జయశంకర్‌ జిల్లా పరిపాలన ప్రారంభించేలా పనులు ముమ్మరం చేశారు.

కోల్‌బెల్ట్‌ : జయశంకర్‌ జిల్లా (భూపాలపల్లి) ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో భాగంగా కేటాయించిన భవనాలను ఆయా శాఖలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. దసరా పండుగ రోజున జయశంకర్‌ జిల్లా పరిపాలన ప్రారంభించేలా పనులు ముమ్మరం చేశారు. మంజూర్‌నగర్‌ బంగ్లా ఏరియాలోని సింగరేణి అతిథిగృహాన్ని కలెక్టర్‌ కార్యాలయం, భూపాలపల్లి పట్టణంలోని దేవాదుల అతిథిగృహాన్ని ఆర్డీఓ కార్యాలయం, ఐటీఐ నూతనభవనాన్ని 12 శాఖలకు, సింగరేణి ఎంవీటీసీ భవనాన్ని జిల్లా పోలీసు కార్యాలయానికి, కమ్యూనిటీహాల్‌ను పోలీసు విభాగానికి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని డీఈఓ కార్యాలయానికి ఏర్పాటు చేయనున్నారు. కార్యాలయాలకు అనుగుణంగా ఆయా శాఖలకు చెందిన అధికారుల గదులు, మౌలిక వసతుల కల్పన పనులు చేస్తున్నారు. దసరా పండుగ నాటికి కార్యాలయాలను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దిలా అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement