పేరుపాలెం సొసైటీపై విచారణ | inquiry on perupalem society | Sakshi
Sakshi News home page

పేరుపాలెం సొసైటీపై విచారణ

Apr 12 2017 6:33 PM | Updated on Sep 5 2017 8:36 AM

పేరుపాలెం సొసైటీపై విచారణ

పేరుపాలెం సొసైటీపై విచారణ

మొగల్తూరు: పేరుపాలెం సహకార సంఘ కార్యదర్శిపై విచారణ నిర్వహిస్తున్నామని, రెండు రోజుల్లో నివేదిక అధికారులకు అందిస్తామని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పి.ఆనందరాజు తెలిపారు.

మొగల్తూరు: పేరుపాలెం సహకార సంఘ కార్యదర్శిపై విచారణ నిర్వహిస్తున్నామని, రెండు రోజుల్లో నివేదిక అధికారులకు అందిస్తామని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పి.ఆనందరాజు తెలిపారు. పేరుపాలెం సహకార సంఘ కార్యాలయంలో కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలపై బుధవారం రైతులను విచారించారు. సంఘ కార్యదర్శి అందే రవికిషోర్, అధ్యక్షుడు మేళం గాంధీ మధ్య అభిప్రాయ భేదాలు చోటుచేసుకోవడంతో సంఘ సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. 20 రోజులుగా సంఘ కార్యకలాపాలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 4న 20 మంది రైతులు సంఘంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని,  విచారణ నిర్వహించాలని కోరుతూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆదేశాలతో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆనందరాజు సంఘ కార్యదర్శి, అధ్యక్షుడు, రైతులను విచారించారు. సంఘంలో రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు రైతుల ఆరోపణలు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement