27, 28 తేదీల్లో ఏలూరులో జాబ్‌మేళా | in eluru two days job mela | Sakshi
Sakshi News home page

27, 28 తేదీల్లో ఏలూరులో జాబ్‌మేళా

Jul 25 2016 9:15 PM | Updated on Sep 4 2017 6:14 AM

ఏలూరు సిటీ : జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధిలో బాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి జాబ్‌ మేళా నిర్వహిస్తామని జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ ఎ.చంద్రమౌళీశ్వరి సోమవారం తెలిపారు.

ఏలూరు సిటీ : జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధిలో బాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి జాబ్‌ మేళా నిర్వహిస్తామని జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ ఎ.చంద్రమౌళీశ్వరి సోమవారం తెలిపారు. ఎటువంటి విద్యార్హత లేని యువతకు ఇంటర్వూ్యలు నిర్వహించి ఏలూరు కృష్ణా జూట్‌ మిల్లులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అభ్యర్థుల వయసు 19 సంవత్సరాలు కలిగి, 163 సెం.మీ ఎత్తు ఉండాలని కోరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యువతకు శిక్షణ కాలంలో ఉచిత వసతి, రూ.50 భోజన సదుపాయం కల్పిస్తారని తెలిపారు. డోర్నియర్‌ వీవర్, స్పిన్నర్‌ వీవర్, కాప్‌ వైండింగ్, స్లైౖ ఫీడర్, జనరల్, ఐటీఐ మెకానికల్‌ కేటగిరీల్లో ఉద్యోగాలు ఉంటాయని తెలిపారు. ఈ కేటగిరీల్లో యువతకు శిక్షణ ఇస్తూ రోజువారీ సై్టఫండ్‌ ఇస్తారని, సై్టఫండ్‌ రూ.180 నుంచి గరిష్టంగా రూ.270 వరకు ఉంటుందన్నారు. నైపుణ్యం సాధించిన యువతకు ఉద్యోగావకాశం లభిస్తుందని, రెండు, మూడు సంవత్సరాలు పనిచేస్తే రెగ్యులర్‌ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతర అలవెన్సులు ఇస్తారని తెలిపారు. వివరాలకు 93904 91308 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement