జిల్లాలో 32 సంచార వైద్య బృందాలు | in district 32 moving medical teams | Sakshi
Sakshi News home page

జిల్లాలో 32 సంచార వైద్య బృందాలు

Aug 3 2016 6:27 PM | Updated on Sep 4 2017 7:40 AM

జిల్లాలో 32 సంచార వైద్య బృందాలు

జిల్లాలో 32 సంచార వైద్య బృందాలు

నల్లజర్ల: ఆరేళ్లలోపు పిల్లలు, ఇంటర్‌ వరకు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కోటేశ్వరి తెలిపారు. నల్లజర్ల పీహెచ్‌సీని బుధవారం ఆమె పరిశీలించారు.

నల్లజర్ల: ఆరేళ్లలోపు పిల్లలు, ఇంటర్‌ వరకు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కోటేశ్వరి తెలిపారు. నల్లజర్ల పీహెచ్‌సీని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు 32 సంచార వైద్య బృందాలను నియమించనున్నట్టు తెలిపారు. రాష్ట్రీయ బాల ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు బృందాలు సర్వే చేస్తాయన్నారు. మొత్తం 30 రకాల వ్యాధులపై ప్రాథమిక స్థాయిలో క్షేత్ర పరిశీలన చేసి సర్వేలో పొందుపరుస్తారన్నారు. సర్వేలో గుర్తించిన అంశాలే భవిష్యత్తులో విద్యార్థుల ఆరోగ్య చికిత్సలకు కీలకమవుతాయని చెప్పారు.
పుట్టుకతో వచ్చే లోపాల విభాగంలో 9, రోగనిరోధక శక్తి విభాగంలో 5,బాల్యంలో వచ్చే వ్యాధుల విభాగంలో 6, వైకల్యంతో కూడిన అభివృద్ధి ఆలస్యాల విభాగంలో 10 వ్యాధులకు చోటు కల్పించామన్నారు. సర్వేలో గుర్తించిన వ్యాధుల ప్రకారం ముందుగా పీహెచ్‌సీలో అనంతరం ఏరియా ఆస్పత్రి, డీఈఐసీ కేంద్రాల్లో చికిత్స అందిస్తామన్నారు. జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ఈయూపీహెచ్‌సీలుగా ప్రభుత్వమే నిర్వహించనున్నట్టు చెప్పారు. వర్షాల నేపథ్యంలో వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. 
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement