'తుపాకీ కొనాల్సిన అవసరం నాకు లేదు' | I Don't need to Buy Gun, Says B Sriramulu | Sakshi
Sakshi News home page

'తుపాకీ కొనాల్సిన అవసరం నాకు లేదు'

Aug 14 2015 6:00 PM | Updated on Jun 1 2018 9:05 PM

'తుపాకీ కొనాల్సిన అవసరం నాకు లేదు' - Sakshi

'తుపాకీ కొనాల్సిన అవసరం నాకు లేదు'

తుపాకీ కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని బళ్లారి ఎంపీ బి శ్రీరాములు అన్నారు.

అనంతపురం: తుపాకీ కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని బళ్లారి ఎంపీ బి శ్రీరాములు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... అసాంఘిక కార్యకలాపాల్లో ఏనాడు పాలుపంచుకోలేదని స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే అనంతపురం జిల్లా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు.

బళ్లారిలో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఓ ముఠాను రెండు రోజుల క్రితం అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుంచి ఎంపీ శ్రీరాములు తుపాకీ కొన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను శ్రీరాములు తోసిపుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement