Sakshi News home page

వసతిగృహాల్లో బయోమెట్రిక్‌ విధానం

Published Mon, Oct 24 2016 9:32 PM

hostels in biometric system

  • బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు
  • భానుగుడి (కాకినాడ) : 
    బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, వార్డెన్ల గైర్వాజరును తగ్గించేందుకు త్వరలో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయనున్నట్టు డి.డి.చినబాబు తెలిపారు. వసతిగృహాల్లో బయోమెట్రిక్‌ వి«ధానానికి సంబంధించి సోమవారం వార్డెన్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 82 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ఈ విధానం అమలుకానుందన్నారు. ఈ వసతిగృహాల్లో 5వేలకు మందికి పైగా విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ విధానంపై వార్డెన్లకు అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల, వార్డెన్ల హాజరును బయోమెట్రిక్‌ ద్వారా ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. 
     

Advertisement

What’s your opinion

Advertisement