హాస్టల్ వెల్ఫేర్ అధికారుల ఆందోళన | hostel welfare officers protests at ananthpur collector office | Sakshi
Sakshi News home page

హాస్టల్ వెల్ఫేర్ అధికారుల ఆందోళన

Dec 2 2015 4:35 PM | Updated on Jun 1 2018 8:54 PM

హాస్టల్ వెల్ఫేర్ అధికారుల ఆందోళన - Sakshi

హాస్టల్ వెల్ఫేర్ అధికారుల ఆందోళన

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ హాస్టల్ వెల్ఫేర్ అధికారులు డిమాండ్ చేశారు.

అనంతపురం: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ సంక్షేమ హాస్టళ్ల అధికారులు డిమాండ్ చేశారు. ఏపీ సంక్షేమ హాస్టళ్ల అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.శ్రీరాములు మాట్లాడుతూ.... సంక్షేమ హాస్టళ్ల అధికారుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పదోన్నతుల విషయంలో అన్యాయానికి గురవుతున్నామని.... 30 ఏళ్ల సర్వీస్ ఉన్నవారికి గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 పదోన్నతి కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు మాదిరిగా హాస్టళ్ల అధికారులకు 30 రోజులు ఆర్జిత సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరు ఉద్యోగుల మాదిరిగా ఎనిమిది గంటలు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రీమెట్రిక్ అంటూ అదనపు సమయం పనిచేయిస్తున్నారన్నారు. దీంతో శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బయోమెట్రిక్‌లోని సాంకేతిక సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం డీఆర్‌ఓ పీహెచ్ హేమసాగర్‌కి నాయకులు వినతిపత్రం అందజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement