13 నుంచి ఒంటిపూట బడులు | half day schools from 13 th | Sakshi
Sakshi News home page

13 నుంచి ఒంటిపూట బడులు

Mar 8 2017 1:38 AM | Updated on Sep 5 2017 5:27 AM

ఈ నెల 13 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారని

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :  ఈ నెల 13 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారని పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా విద్యార్థులు అనారోగ్యం పాలుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అలాగే సర్వశిక్షాభియాన్‌ లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న సీఆర్‌పీ, ఐఈఆర్‌టీ, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, డీపీవోలు, కేజీబీవీ, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు, మెసెంజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల జీతాలు మూడు శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్టు  ఆంజనేయులు తెలిపారు. 2014 జూన్‌  తరువాత వారి జీతాలు పెరగలేదని ప్రభుత్వానికి వివరించినట్టు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement