తలనీలాల ఆదాయం రూ.73 లక్షలు | hair cost of rs.73 lakhs | Sakshi
Sakshi News home page

తలనీలాల ఆదాయం రూ.73 లక్షలు

Mar 16 2017 11:02 PM | Updated on Sep 5 2017 6:16 AM

స్థానిక శ్రీ శనీశ్వరాలయం అన్నదాసోహ భవనంలో గురువారం నిర్వహించిన తలనీలాల వేలంలో రూ. 73 లక్షలు ఆదాయం లభించింది.

పావగడ : స్థానిక శ్రీ శనీశ్వరాలయం అన్నదాసోహ భవనంలో గురువారం నిర్వహించిన తలనీలాల వేలంలో రూ. 73 లక్షలు ఆదాయం లభించింది. హిందూపురానికి చెందిన వేలందారులు ఆనంద్, ఆదినారాయణ వేలంలో పాల్గొని, తలనీలాలను దక్కించుకున్నారు. అదేవిధంగా భక్తులు స్నానమాచరించిన తర్వాత వదిలేసిన పాత వస్త్రాలు వేలంలో రూ 5.45 లక్షలకు వేలందారులు దక్కించుకున్నారు. కొబ్బరి వేలాన్ని వాయిదా వేశారు. వేలంలో ఎస్‌ఎస్‌కే సంఘం అధ్యక్షుడు ధర్మపాల్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ఆనందరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement