తీజ్‌ పండుగకు ప్రభుత్వం చేయూత | Government support Teej festival | Sakshi
Sakshi News home page

తీజ్‌ పండుగకు ప్రభుత్వం చేయూత

Sep 9 2016 12:44 AM | Updated on Sep 4 2017 12:41 PM

బంజారులు ఏటా జరుపుకునే తీజ్‌ పండుగ నిర్వహణకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని శాసన lసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని ఒడితల గ్రామ శివారు పాశిగడ్డతండాలో గురువారం గిరిజనులు తీజ్‌ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.

చిట్యాల : బంజారులు ఏటా జరుపుకునే తీజ్‌ పండుగ నిర్వహణకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని శాసన lసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని ఒడితల గ్రామ శివారు పాశిగడ్డతండాలో గురువారం గిరిజనులు తీజ్‌ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ తీజ్‌ పండుగ గిరి జన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. రానున్న రోజుల్లో తీజ్‌ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు చర్య లు తీసుకుంటుందన్నారు. అనంతరం గిరిజన యువతులు తీజ్‌బుట్టలను తండా సమీపంలోని చెరువులు, బావుల్లో నిమజ్జనం చేశారు. కాగా, ఉత్సవాల్లో స్పీకర్‌ దరువేసి ప్రజలను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కాట్రేవుల సాయిలు, టీఆర్‌ఎస్‌ యూత్‌ రాష్ట్ర నాయకుడు సిరికొం డ ప్రశాంత్, మండల అధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి, యూత్‌ అధ్యక్ష, కార్యదర్శులు కత్తి సంపత్, జన్నె యుగేంధర్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఓరంగంటి సధాకర్, నాయకులు శ్రీనివాసరావు, గణపతి, శంకర్, పాపిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement