
శభాష్ పోలీస్..
శంకర్ ఆ వృద్ధురాలి అవస్థను గమనించి రోడ్డు దాటించాడు.
సాక్షి,సిటీబ్యూరో: ట్రాఫిక్ పోలీసులంటే ఫొటోలు తీస్తారు.. కేసు రాసి చలాన్ విధిస్తారు.. వాహనాలను స్టేషన్‌కు తరలిస్తారని అందరూ అనుకుంటారు. కానీ వారు సామాజిక సేవ కూడా చేస్తారనడానికి ఈ చిత్రాలే ఉదాహరణ. శనివారం షాపూర్‌నగర్ రంగ భుజంగ థియేటర్ చౌరస్తాలో వాహనాల రద్దీ బాగా ఉండడంతో ఓ వృద్ధురాలు రోడ్డు దాటలేని పరిస్థితిలో ఉంది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది శంకర్ ఆ వృద్ధురాలి అవస్థను గమనించి రోడ్డు దాటించాడు.