చిన్నపాటి వివాదంతో దళితులపై అగ్రవర్ణాలు దాడిచేసిన ఘటన రొంపిచర్ల మండలం పరగటిచర్లలో శుక్రవారం రాత్రి జరిగింది.
రొంపిచర్ల (గుంటూరు) : చిన్నపాటి వివాదంతో దళితులపై అగ్రవర్ణాలు దాడిచేసిన ఘటన రొంపిచర్ల మండలం పరగటిచర్లలో శుక్రవారం రాత్రి జరిగింది. ఉపాధి హామీ పనుల విషయంలో గ్రామంలోని టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి.
ఈ విషయంలో దళిత వర్గానికి చెందిన వారిని అగ్రవర్ణానికి చెందిన మరో వర్గం దుర్భాషలాడింది. దీంతో దళిత వర్గం నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆగ్రహం చెందిన అగ్రవర్ణాల వారు దళితులపై దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ నాగేశ్వర్‌తో పాటు మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైనవారిని ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.