బళ్లారి నుంచి విజయవాడ వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సులో శుక్రవారం రాత్రి గుంతకల్లు సమీపంలో ఆకస్మికంగా మంటలు, పొగలు వ్యాపించాయి.
గుంతకల్లు రూరల్ : బళ్లారి నుంచి విజయవాడ వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సులో శుక్రవారం రాత్రి గుంతకల్లు సమీపంలో ఆకస్మికంగా మంటలు, పొగలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు భారీగా కేకలు పట్టడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపి ప్రయాణికులను దించేశారు.
రాత్రి 7.30 గంటల సమయంలో గుంతకల్లు బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సుకు కొద్ది దూరం వెళ్లగానే సైలెన్సర్ ఊడిపడి రోడ్డుకు రాసుకుంటూ వెల్లడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. కాగా శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా మెకానిక్ రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.