ఎరువుల ధరలు తగ్గాయోచ్‌.. | fertilizer prices discreas | Sakshi
Sakshi News home page

ఎరువుల ధరలు తగ్గాయోచ్‌..

Jul 21 2016 9:34 PM | Updated on Sep 4 2017 5:41 AM

ఎరువుల ధరలు తగ్గాయోచ్‌..

ఎరువుల ధరలు తగ్గాయోచ్‌..

గతంలో ఉన్న ధరలకన్నా.. కొంతమేర ఎరువుల ధరలు తగ్గడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రసాయన ఎరువుల ధరల వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ గురువారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాలకు విడుదల చేసింది.


ఖమ్మం వ్యవసాయం :
గతంలో ఉన్న ధరలకన్నా.. కొంతమేర ఎరువుల ధరలు తగ్గడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రసాయన ఎరువుల ధరల వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ గురువారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాలకు విడుదల చేసింది. ఈ మేరకు వివిధ కంపెనీలకు చెందిన ఎరువుల ధరలను జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు పి.మణిమాల వివరించారు. కొంత మేర తగ్గిన  ధరలను ఇకనుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయాధికారులు నిర్ణయించిన ధరలతో(తగ్గిన) ఎరువుల విక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే నిబంధనల మేరకు చర్యలుంటాయని ఆమె పేర్కొన్నారు.
తగ్గిన ఎరువుల ధరలు ఇలా..
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
కంపెనీ పేరు                                   డీఏపీ రూ.లలో           ఎంఓపీ రూ.లలో
 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
కోరమాండల్‌ ఇండియా లిమిటెడ్‌              1,155                     577
ఇఫ్‌కో                                                 1,155                      –––
స్పిక్‌                                                   1,155                     –––
ఐపీఎల్‌                                                1,140                      577
ఆర్‌ఎల్‌ఎఫ్‌                                           1,102                       603
పీపీఎల్‌                                                1,156                       570
జడ్‌ఐఎల్‌                                              1,156                       578
జీఎస్‌ఆర్‌ఎఫ్‌                                          1,155                  ––––
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
డీఏపీ : డైఅమోనియా పాస్పేట్‌
ఎంఓపీ : మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌       
 


Advertisement

పోల్

Advertisement