పాముకాటుతో ఉపాధి కూలీ మృతి | employment guarantee scheme laborer died of snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో ఉపాధి కూలీ మృతి

Published Fri, May 6 2016 1:34 PM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

తూర్పు గోదావరి జిల్లా జగ్గం పేట మండలం జే.కొత్తూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీ శుక్రవారం పాము కాటు తో మృతి చెందింది.

తూర్పు గోదావరి జిల్లా జగ్గం పేట మండలం జే.కొత్తూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీ శుక్రవారం పాము కాటు తో మృతి చెందింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలోని చెరువులో పూడికతీత పనులు జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన సరిపల్లి పాపాయమ్మ(50) కూలి పనులకు వెళ్లగా నాగు పాము కాటేసింది. దీంతో ఆమె నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాపాయమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement