చండీయాగానికి తరలివచ్చిన ప్రముఖులు | eminent persons attend to mahachandiyaga | Sakshi
Sakshi News home page

చండీయాగానికి తరలివచ్చిన ప్రముఖులు

Dec 25 2015 10:21 PM | Updated on Jul 11 2019 7:45 PM

అయుత మహా చండీయాగం మూడోరోజు కార్యక్రమం శుక్రవారం ఉదయం గురుపార్థనలతో ప్రారంభమైంది. ఉ8.20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాగశీల ప్రవేశం చేశారు.

హైదరాబాద్: అయుత మహా చండీయాగం మూడోరోజు కార్యక్రమం శుక్రవారం ఉదయం గురుపార్థనలతో ప్రారంభమైంది. ఉ8.20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాగశీల ప్రవేశం చేశారు. గురుప్రార్ధనలో భాగంగా శృంగేరిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతితిర్థి స్వామివారికి వందేగురు పరంపర అంటూ రుత్విజులు పఠనం చేస్తుండగా సీఎం గురువుకు సాష్టాంగ ప్రణామం చేశారు. సప్తశాధీ పారయాగం ప్రారంభించే ముందు పూర్వాంగం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అఃతర మాతృకశ్యాసాలు, బహిర్ మాతృకన్యాసాలు, చండీ కవచం, అర్గళ, కీలక పఠనం, ఏకదశిశ్యానాలు నిర్వహించారు. శరీరంలో అమ్మవారిని ఆవాహన చేసుకునేందుకు రుత్విజులు పాటించే సంప్రదాయ కార్యకామమిది. యాగశాల పొంగగాన్ని చాయంతి, బంతి పూలతో ప్రత్యేకంగా అలంకరించి ఆకర్షణీయంగా మార్చారు. గురుప్రార్థనతో కలియతిరిగి రుజ్విజులకు అభివాదం చేశారు.
 
శుక్రవారంనాటి కార్యకామానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి, శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణనందస్వామిలకు సీఎం స్వాగతం పలికి, పాదాభివందనం చేశారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ చక్రపాణి , ఆంధ్రప్రదేశ్అసెంబ్లీ స్వీకర్ కోడెల శివప్రసాదరావు , తెలంగాణమంత్రులు టీ హరీష్‌రావు, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివవాస్ రెడ్డి, చందూలాల్, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పేర్వారం రాములు, మీడియా సంస్థల అధిపతులు గిరీష్ సంఘి, గౌతమ్, వీ రాధాకృష్ణ, శైలజాకిరణ్, పలువులు అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ దంపతులు ఉదయం పూజల్లో పాల్లొని, అన్నప్రసాదాలు స్వీకరించారు.

 యాగశాలకు వచ్చిన అతిథులకు ప్రధానం ద్వారం వద్ద మంత్రి హరీష్‌రావు ఆహ్వానించగా , యాగశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో ప్రదక్షిణం చేయించారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠం నుంచి వచ్చిన ప్రధాన రుత్వికుల్లో ఒకరైన ఫశిశశాంక శర్మ అయుత చండీయాగం నేపధ్యాన్ని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement