మార్కెట్‌లోకి ‘ఎలాంట్రా’ | elantra car came in market | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ‘ఎలాంట్రా’

Aug 27 2016 8:19 PM | Updated on Sep 4 2017 11:10 AM

మార్కెట్‌లోకి ‘ఎలాంట్రా’

మార్కెట్‌లోకి ‘ఎలాంట్రా’

కొత్త ఎలాంట్రా మోడల్‌ కారును శనివారం నగరంలో విడుదల చేశారు.

సాక్షి, సిటీబ్యూరో: కొత్త ఎలాంట్రా మోడల్‌ కారును శనివారం నగరంలో విడుదల చేశారు. హ్యూండాయ్‌ మోటార్‌ ఇండియా అధునాతన హంగులతో రూపొందించిన ఈ కారును నగరంలోని తల్వార్‌ హుండాయ్‌ షోరూమ్‌లో ఆవిష్కరించారు. తల్వార్‌ గ్రూపు చైర్మెన్‌ సునీల్‌ తల్వార్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సరళ్‌ తల్వార్, రీజనల్‌ మేనేజర్‌ ఎం.ఎ.సలీమ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సలీమ్‌ మాట్లాడుతూ ఆల్‌ న్యూ ఎలాంట్రా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమ్ముడవుతోందన్నారు. సుదీర్ఘమైన పరిశోధన అనంతరం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ కారు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు వివరించారు. అన్నిlసదుపాయాలతో ఇది అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement