breaking news
Elantra
-
హ్యుందాయ్ కొత్త ఎలంట్రా
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా తన ప్రీమియం సెడాన్ ‘ఎలంట్రా’ మోడల్లో అధునాతన వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ అప్డేటెడ్ కారు ధరల శ్రేణి రూ. 15.89 లక్షల నుంచి రూ. 20.39 లక్షలు (ఎక్స్‌షోరూం, ఢిల్లీ)గా నిర్ణయించింది. యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ) వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్లతో విడుదలైన ఈ అధునాతన వెర్షన్.. 2–లీటర్ పెట్రోల్ పవర్‌ట్రెయిన్, సిక్స్–స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మెషీన్లలో అందుబాటులోకి వచ్చింది. -
మార్కెట్లోకి ‘ఎలాంట్రా’
సాక్షి, సిటీబ్యూరో: కొత్త ఎలాంట్రా మోడల్ కారును శనివారం నగరంలో విడుదల చేశారు. హ్యూండాయ్ మోటార్ ఇండియా అధునాతన హంగులతో రూపొందించిన ఈ కారును నగరంలోని తల్వార్ హుండాయ్ షోరూమ్‌లో ఆవిష్కరించారు. తల్వార్ గ్రూపు చైర్మెన్ సునీల్ తల్వార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరళ్ తల్వార్, రీజనల్ మేనేజర్ ఎం.ఎ.సలీమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సలీమ్ మాట్లాడుతూ ఆల్ న్యూ ఎలాంట్రా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమ్ముడవుతోందన్నారు. సుదీర్ఘమైన పరిశోధన అనంతరం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ కారు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు వివరించారు. అన్నిlసదుపాయాలతో ఇది అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.