భీమదేవరపల్లి: వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులను నిల్వ చేసుకోడానికి ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డాక్టర్ ఏరుకొండ నర్సింహాస్వామి అన్నారు.
సంపాదిత సెలవుల నిల్వకు ఉత్తర్వులు ఇవ్వాలి
Aug 21 2016 10:45 PM | Updated on Sep 4 2017 10:16 AM
భీమదేవరపల్లి: వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులను నిల్వ చేసుకోడానికి ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డాక్టర్ ఏరుకొండ నర్సింహాస్వామి అన్నారు. మండలంలోని ముల్కనూర్‌లో ఆ సంఘం మండల శాఖ అధ్యక్షుడు కర్రె సాంబమూర్తి అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహస్వామి మాట్లాడుతూ పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు ఈఎల్స్ మంజూరు ఉత్తర్వులు ఇచ్చి వారి సేవ పుస్తకంలో నమోదు చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శులు దస్తరి శంకరయ్య, లింగ్యానాయక్ మాట్లాడుతూ జోనల్ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నాయకులు మంగ అమరేందర్, గుర్రం శ్రీనివాస్, గుర్రం సాంబయ్య, బత్తిని తిరుపతి, వెంకటస్వామి, సమ్మిరెడ్డి, అంజన్‌కుమార్, భిక్షపతి, రాజయ్య, శ్రీనివాస్, సునంద, మాధవి, జ్యోతి ఉన్నారు.
Advertisement
Advertisement