క్వార్టర్ల కోసం సింగరేణి జీఎంను కలిసిన ఏఎస్పీ | DSP meet GM for the quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్ల కోసం సింగరేణి జీఎంను కలిసిన ఏఎస్పీ

Sep 20 2016 12:36 AM | Updated on Aug 21 2018 9:00 PM

క్వార్టర్ల కోసం సింగరేణి జీఎంను కలిసిన ఏఎస్పీ - Sakshi

క్వార్టర్ల కోసం సింగరేణి జీఎంను కలిసిన ఏఎస్పీ

జయశంకర్‌ జిల్లాలో పోలీస్‌ అధికారుల నివాసాల కోసం సింగరేణి క్వార్టర్స్‌ కేటాయించాలని ములుగు ఏఎస్పీ విశ్వజిత్‌ కాంపాటి కోరారు. ఈమేరకు సోమవారం ఆయన సింగరేణి భూపాలపల్లి పట్టణంలో జీఎం పాలకుర్తి సత్తయ్యను కలిశారు.

కోల్‌బెల్ట్‌ : జయశంకర్‌ జిల్లాలో పోలీస్‌ అధికారుల నివాసాల కోసం సింగరేణి క్వార్టర్స్‌ కేటాయించాలని ములుగు ఏఎస్పీ విశ్వజిత్‌ కాంపాటి కోరారు. ఈమేరకు సోమవారం ఆయన సింగరేణి భూపాలపల్లి పట్టణంలో జీఎం పాలకుర్తి సత్తయ్యను కలిశారు. దసరా నుంచి భూపాలపల్లి జిల్లా కార్యకలాపాలు ప్రారంభం కానున్నందున ఏఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు మంజూర్‌నగర్‌ బంగ్లా ఏరియాలో 8 ఎంఏ క్వార్టర్స్‌ను కేటాయించాలని కోరారు. కాగా మంజూర్‌నగర్‌ సమీపంలోని వెయ్యి క్వార్టర్స్‌ నిర్మాణ స్థలం వద్ద పోలీస్‌శాఖ పరేండ్‌ గ్రౌండ్‌కు 30 ఎకరాలు కేటాయించినట్లు జీఎం సత్తయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement