ప్రమాదాల నివారణలో డ్రైవర్లదే కీలకపాత్ర | drivers key role in accidents remove | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణలో డ్రైవర్లదే కీలకపాత్ర

Jul 14 2017 9:53 PM | Updated on Sep 5 2017 4:02 PM

రోడ్డు ప్రమాదాలు నివారించడంలో డ్రైవర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ సూచించారు.

అనంతపురం రూరల్‌ : రోడ్డు ప్రమాదాలు నివారించడంలో డ్రైవర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ సూచించారు. అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని ఎకాలజీ సెంటర్‌లో డ్రైవింగ్‌ శిక్షణను శుక్రవారం ఆయన ప్రారంభించారు. డ్రైవర్లు మెలకువలు తెలుసుకుని వాహనాలు నడపాలన్నారు. నైపుణ్యాన్ని ప్రదర్శించి డ్రైవింగ్‌ చేస్తే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. అనంతరం డ్రైవింగ్‌ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డ్రైవింగ్‌ లైసెన్సులు అందజేశారు. ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మల్లారెడ్డి మాట్లాడుతూ 2008 నుంచి ఇప్పటిదాక  గ్రామీణ ప్రాంతాల్లోని 15వందల మందికి పైగా నిరుద్యోగులకు డ్రైవింగ్‌పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ద్విచక్రవాహనాల మెకానిక్‌పై శిక్షణ తరగతులను ప్రారంభించారు. కార్యక్రమంలో డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మొహిద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement