ప్రత్యేక హోదాతోనే రాష్ర్టాభివృద్ధి | develop with special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాతోనే రాష్ర్టాభివృద్ధి

Jan 29 2017 11:52 PM | Updated on Sep 5 2017 2:25 AM

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని బీసీ జనసభ యువజన సంఘం అధ్యక్షులు సగర పవన్‌కుమార్‌ అన్నారు.

అనంతపురం న్యూటౌన్‌ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని బీసీ జనసభ యువజన సంఘం అధ్యక్షులు సగర పవన్‌కుమార్‌ అన్నారు. ఆదివారం జనసభ జిల్లా కార్యాలయంలో యువజన కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమంలో పవన్‌కుమార్‌ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం హోదా ఇస్తామని చెప్పి తీరా ఇప్పుడు ప్యాకేజీ రాగం అందుకోవడం  తెలుగు వారిని మోసగించడమేనన్నారు.

ప్యాకేజీకి చట్టబద్ధత లేదని హోదాతో మాత్రమే అనేక రాయితీలు వస్తాయని, పరిశ్రమలు విరివిగా వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు.  తమిళులు జల్లికట్టు కోసం చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరులో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామ్మోహన్, రమేష్, తరుణ్, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement